అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | జిల్లాలో కొనసాగుతున్న ఆర్వోబీ పనులకు నిధులు విడుదల చేసి పనులు తర్వగా పూర్తయ్యేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy) తల్లి దశదినకర్మ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద వినతిపత్రం అందజేశారు.
ఆర్వోబీతో పాటు పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు ఆర్వోబీలతో పాటు భారీ వర్షాల (Heavy rains) వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందజేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, పూర్తయినప్పటికీ అందజేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) జిల్లా సమస్యలను సమగ్రంగా వివరించామని చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రభుత్వ నిజాయితీపై ఆధారపడి ఉందని వారు పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్లో సీఎంను కలిసేందుకు అనుమతినివ్వాలంటూ భైఠాయించారు.