అక్షర టుడే, ఇందూరు : BJP Mayor Nizamabad | నిజామాబాద్ అర్బన్‌లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు.
BJP Mayor Nizamabad | అఖండ విజయం తథ్యం..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందూరు మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. ‘మన ఇందూరు.. మన మేయర్’ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నినాదాన్ని నగరవాసులు బలంగా విశ్వసించారన్నారు. నగర అభివృద్ధి కేవలం బీజేపీ (BJP)తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ఫలితాల రోజు ఆ పార్టీలకు భంగపాటు తప్పదన్నారు.
BJP Mayor Nizamabad | ఏజెంట్లు సమయపాలన పాటించాలి..
ఏజెంట్లు సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని ధన్పాల్, దినేష్ (Dinesh Kulachari) సూచించారు. బాక్స్ ఓపెన్ చేసేముందు సీల్స్ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. ఓట్లు లెక్కించేటప్పుడు ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలని పేర్కొన్నారు. బీజేపీకి పడిన ఓటును పొరపాటున ‘ఇన్ వ్యాలిడ్’ కింద వేయకుండా చూసుకోవాలన్నారు. అనుమానం ఉంటే వెంటనే అభ్యంతరం చెప్పాలని వివరించారు. ప్రతి రౌండ్ తర్వాత అధికారుల లెక్కలతో సరిచూసుకోవాలని, కౌంటింగ్‌లో తేడా అనిపిస్తే వెంటనే రీకౌంటింగ్ కోరాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో నాయకులు రామచందర్, నాగోల్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, తిరుపతిరెడ్డి, బద్దంకిషన్, బంటు రాము, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.