అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Mandal | భీమ్గల్ మండల అభివృద్ధికి చొరవ చూపాలని బీజేపీ నాయకులు (BJP leaders) కోరారు. ఈ మేరకు మండలస్థాయి అధికారులను (mandal-level officials) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షుడు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
భీమ్గల్ తహశీల్దార్ షబ్బీర్, ఎంపీడీవో గంగుల సంతోష్, భీమ్గల్ సీఐ సత్యనారాయణలను (CI Satyanarayana) వారు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. అలాగే, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై తిరుపతి, ఏవో లావణ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు కోరారు.
కార్యక్రమంలో కుప్గల్ సర్పంచ్ నర్సింగ్ రావు, ఎంజీ తండా సర్పంచ్ గణేష్, చేంగల్ ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, సీనియర్ నాయకులు సంధ్య రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టి ప్రేమ్చంద్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు వెంకటేష్, హరి ప్రసాద్, కుండల అన్వేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.