అక్షరటుడే, భీమ్గల్ : Swachh Bharat | మండలంలోని బాబానగర్ ప్రాథమిక పాఠశాల(Babanagar Primary School), బాచన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బీజేపి మండల శాఖ(BJP Mandal Branch) ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛభారత్(Swachh Bharat) కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు ఆరె రవీధర్ తెలిపారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ(PM Modi) మొదటిసారి ప్రధాని అయిన తర్వాత 2014లో తీసుకురావడం జరిగిందన్నారు. స్వచ్ఛభారత్ అనేది ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఒక మహోన్నత సేవా కార్యక్రమమని ఆయన కొనియాడారు. దీంట్లో తప్పకుండా ప్రతి పౌరుడు పాల్గొనాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట గంగాధర్, బాబానగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు మంద సురేష్, మండల నాయకులు కొండగంగాధర్ గౌడ్, నాగుల భూమన్న, తోట రమేష్, కృష్ణ, బాచన్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు శెట్టి లక్ష్మణ్ బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టి ప్రేమ్చంద్, సుదర్శన్, రంజిత్ బూత్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.