అక్షరటుడే, ఇందూరు: Paddy Centers | జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), రాకేశ్ రెడ్డి (Mla Rakesh reddy), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari) డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో వేల ఎకరాల్లో కోసిన పంటను కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై కుప్పలుగా ఉంచారన్నారు. కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం.. వర్షాల వల్ల ధాన్యం తడిసి రంగుమారిందని వివరించారు.
Paddy Centers | మద్దతు ధరకు కొనాలి
వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధన పెట్టకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు కోరారు. అలాగే ప్రతి సీజన్లో తగినన్ని టార్పాలిన్లు అందించకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వినతిపత్రం అందించిన వారిలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

