Bjp leaders protest | గూండాల్లా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులు

అక్షరటుడే, ఇందూరు: Bjp leaders protest | కామారెడ్డిలోని కాంగ్రెస్ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్​పై దాడికి నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్​లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అక్కడి నాయకులు ఎమ్మెల్యేపై దౌర్జన్యంగా దాడి చేసేందుకు కుట్రపన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు […]

అక్షరటుడే, ఇందూరు: Bjp leaders protest | కామారెడ్డిలోని కాంగ్రెస్ నాయకులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్​పై దాడికి నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్​లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అక్కడి నాయకులు ఎమ్మెల్యేపై దౌర్జన్యంగా దాడి చేసేందుకు కుట్రపన్నారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు నిజమైతే అందుకు సంబంధించిన రుజువులు అధికారుల ముందు పెట్టాలని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తగిన రుజువులు కలెక్టర్ ముందు పెట్టేందుకు సిద్ధమయ్యారని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు కూడా ముందుకు రావాలని సవాల్​ విసిరారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని సహించలేని కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నిజామాబాద్​ అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

​అక్షరటుడే, భీమ్​గల్ : Vemula Prashanth Reddy Protest | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Projects Completion | రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth...

NSUI Sandeep Challenge | సమయం ఖరారు చేసి చెప్పాలి..: ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: NSUI Sandeep Challenge | ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఎమ్మెల్యే సవాల్​కు తాము సిద్ధమని, సోమవారం...

Neelam Chinna Rajulu | ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉంది..: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు

అక్షరటుడే, కామారెడ్డి: Neelam Chinna Rajulu | కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ప్రాణహాని ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు...