అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని ఒకటో వార్డులో గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బీజేపీ నాయకులు సోమవారం మొక్కలు నాటారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం (Bjp Government) 11 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాలనలో (Pm Modi) చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు బాలకిషన్, పట్టణాధ్యక్షుడు అగల్ దివిటి రాజేష్, ఉపాధ్యక్షుడు కాశీనాథ్, ప్రధాన కార్యదర్శి శ్రీను, బాలయ్య, పండరి, గజానంద్ తదితరులు పాల్గొన్నారు.
