అక్షరటుడే, ఇందూరు : Turmeric Board Office | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board office) కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) ఎంతో కృషి చేశారని ఆ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి (Board Chairman Palli Gangareddy) అన్నారు.
పసుపు బోర్డు కార్యాలయానికి భవనం మంజూరు కావడంతో బుధవారం బీజేపీ నాయకులు (BJP leaders) శ్రద్ధానంద్ గంజ్ లో సంబరాలు జరిపారు. ప్రధాని మోదీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీ కృషి వల్లే కార్యాలయం వచ్చిందని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకుడు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు న్యాలం రాజు, నాగోల్ల లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

