HomeUncategorizedBJP | కాంగ్రెస్​ పోస్ట్​పై బీజేపీ నాయకుల ఆగ్రహం

BJP | కాంగ్రెస్​ పోస్ట్​పై బీజేపీ నాయకుల ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | కాంగ్రెస్ congress ఎక్స్​ వేదికగా పెట్టిన ఓ పోస్టుపై బీజేపీ bjp నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్​ ఎక్స్​ ఖాతాలో తల లేని నేత ఫోటోను పెట్టి గాయబ్​ అనే ట్యాగ్​లైన్​తో పోస్టు చేసింది. దీనిపై సోషల్​ మీడియా social mediaలో పెద్ద రచ్చ జరుగుతుండగా బీజేపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోదీ తల లేని ఫొటో పెట్టి అవమానించారని బీజేపీ మండిపడుతోంది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కాదు.. లష్కరే పాకిస్తాన్‌ కాంగ్రెస్‌ అంటూ ఆ పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల తీసే విధానం ఉగ్రవాదుల్లోనే ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్​ పోస్ట్​పై బీజేపీ నేతలు ఢిల్లీ సీపీ Delhi CPకి ఫిర్యాదు చేశారు.