అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | బీజేపీ నేతల తీరు బీఆర్‌ఎస్‌పై కక్ష, కాంగ్రెస్‌కు రక్ష అన్నట్లు ఉందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం రమేష్ అంటే చీటింగ్, మనీ లాండరింగ్ అని మండిపడ్డారు.
తెలంగాణతో (Telangana) పాటు కర్ణాటక (Karnataka), మహారాష్ట్రలో (Maharashtra) కాంగ్రెస్ నేతలతో కలిసి అక్రమ దందాలతో డబ్బు కూడబెట్టుకున్నారని, తనపై ఈడీ, ఐటీ దాడులు తప్పించుకునేందుకు బీజేపీ పంచన చేరాడన్నారు. హెచ్‌సీయూ భూములు తాకట్టుపెట్టి రూ.10వేల కోట్ల అప్పు తేవడంలో రేవంత్ సర్కారుకు దళారిగా పని చేశాడని ఆరోపించారు.
అందుకు ప్రతిఫలంగా ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ ఆడుతున్న అవినీతి ఆటలో రూ.1300 కోట్ల టెండర్లు దక్కించుకున్నారని, అందుకు కృతజ్ఞతగా సీఎం రమేష్ చంద్రబాబు, రేవంత్ తరపున వకాల్తా పుచ్చుకుని బీఆర్‌ఎస్‌పై విషం కక్కుతున్నాడని విమర్శించారు.
సీఎం రమేష్ (CM Ramesh) వ్యాఖ్యలు చంద్రబాబు, రేవంత్ స్క్రిప్ట్‌లో భాగమేనని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికలో లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుట్రలు షురూ చేసిందనడానికి సీఎం రమేష్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. కమ్మ సామాజిక వర్గానికి బీఆర్‌ఎస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆ వర్గం వారు బీఆర్‌ఎస్‌కు అవసరం లేదని కేటీఆర్ అన్నట్లు రమేష్ చేసిన వ్యాఖ్యలు అబద్దమని ఖండించారు. సీఎం రమేష్‌ను హైదరాబాద్‌లో కాలుపెట్టకుండా తరిమికొడతామని హెచ్చరించారు.