ePaper
More
    HomeతెలంగాణTelangana BJP president | బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్​రావు!

    Telangana BJP president | బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్​రావు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana BJP president | తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదలైన విషయం తెలిసిందే. నేడు నామినేషన్ల ప్రక్రియ (nomination process) ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారనే దానిపై గత కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఈ సస్పెన్స్‌కు తెరపడింది. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు (former MLC Ramchandra Rao) పేరును కమలం పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.

    Telangana BJP president | హైకమాండ్​ నుంచి సమాచారం..

    బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్‌ రావు (Naraparaju Ramchandra Rao) పేరు ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో నామినేషన్ వేయించాలని పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర అధినాయకత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన నేడు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నారు. అయితే, మధ్యాహ్నంలోపు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ (high command) చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు అందుబాటులో ఉండాలని ఫోన్లు కూడా వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.

    Telangana BJP president | రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

    బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక (state presidential election) కోసం నేడు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా.. 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఒకే నామినేషన్ దాఖలు అయితే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే మంగళవారం అధ్యక్ష ఎన్నికపై అధికారిక ప్రకటన ఉండనుంది. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు (state council members), 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొంటారు. ఎన్నికల అధికారిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు.

    More like this

    Hockey Team | హాకీ జ‌ట్టుకు న‌జ‌రానా.. ఒక్కో స‌భ్యుడికి రూ.3 ల‌క్ష‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hockey Team | ఆసియా క‌ప్ టైటిల్‌ను గెలుపొందిన పురుషుల హాకీ జ‌ట్టుకు హాకీ...

    Cherlapalli Drugs Case | కూలీగా చేరి డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు చేసిన కానిస్టేబుల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Cherlapalli | హైదరాబాద్​ నగరంలో మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) ఇటీవల భారీ డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు...

    Stellant Securities India Ltd | ఐదేళ్లలో లక్షను కోటి చేసిన స్టాక్.. ఈ ఏడాది మే 16 నుంచి నాన్‌ స్టాప్‌ పరుగులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stellant Securities India Ltd | స్టెల్లంట్‌ సెక్యూరిటీస్‌ ఇండియా లిమిటెడ్‌(Stellant Securities India...