అక్షరటుడే, ఇందూరు : Nizamabad Municipal BJP Candidates | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) పరిధిలో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. బీజేపీ అభ్యర్థులు ఉత్సాహంగా పత్రాలు సమర్పించారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం మొదటి జాబితా విడుదల చేశారు. ఆదివారం రాత్రి రెండో జాబితాను సైతం ప్రకటించారు.
Nizamabad Municipal BJP Candidates | ఆశావహుల సంఖ్య పెరగడంతో..
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల పోటీ విపరీతంగా మారింది. ఒక్కో డివిజన్ నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ విపరీతంగా మారడంతో అధిష్టానం అభ్యర్థుల ఎంపికను సర్వే ప్రకారం నిర్ణయించింది.
Nizamabad Municipal BJP Candidates | కొత్తపాత కలయికతో..
ఈ సందర్భంగా మొదటి జాబితా విడుదల చేసిన అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ.. నగరంలో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను కొత్తపాత కలయికలో ఎంపిక చేశామని పేర్కొన్నారు. సర్వే ప్రకారమే ఎంపిక జరిగిందని వివరించారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేవిధంగా ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు ఆయన తెలిపారు.
Nizamabad Municipal BJP Candidates | రెండో జాబితా అభ్యర్థులు వీరే..
11వ డివిజన్ అభ్యర్థిగా గట్ల గంగాధర్, 12వ డివిజన్ అభ్యర్థిగా అక్తారి బీ, 13వ డివిజన్ మాలవత్ కీర్తి, 30వ డివిజన్ మీరా, 32వ డివిజన్ తహసీన్ సుల్తానా, 33వ డివిజన్ నజియా తబస్సుం, 51వ డివిజన్ బాలకిషన్, 52వ డివిజన్ కే.కిరణ్, 55వ డివిజన్ ఇమ్రాన్ ఖాన్, 15వ డివిజన్ అభ్యర్థిగా మేధరి శేఖర్‌లకు బీఫాంలను అందజేశారు.
Nizamabad Municipal BJP Candidates | మొదటి విడత జాబితాలో ఉన్నది వీరే..
ఒకటో డివిజన్ కొర్వ గంగాధర్, రెండో డివిజన్ మారంపల్లి మోహన్, మూడో డివిజన్ చింత ప్రసన్న, నాలుగో డివిజన్ వీరమాచినేని ప్రమోద్, ఐదో డివిజన్ యాదల నరేశ్, ఆరో డివిజన్ స్రవంతి రెడ్డి (Sravanthi Reddy), ఏడో డివిజన్ నిమ్మల శ్రావణ్ కుమార్, ఎనిమిదో డివిజన్ మఠం పవన్ కుమార్, తొమ్మిదో డివిజన్ ఇల్లందుల మమత, పదో డివిజన్ పుట్ట వీరేందర్, 16వ డివిజన్ పంచరెడ్డి అనిత, 17వ డివిజన్ గడ్డం మమత, 18వ డివిజన్ పసునూరి రమేశ్, 19వ నాగోల్ల లక్ష్మీ నారాయణ (Lakshmi Narayana), 20వ డివిజన్ న్యాలం సునీత, 21వ డివిజన్ దొంతుల జ్యోతి, 22వ డివిజన్ పులగం వైష్ణవి, 23వ మేకల విజయ, 24వ డివిజన్ ఇప్పకాయల సుమీత్ర దేవి, 25వ డివిజన్ చింతకాయల రాజేందర్, 26వ డివిజన్ బంటు రాము, 27వ డివిజన్ కల్పె అర్చన, 28వ డివిజన్ మల్కాయి సమత, 34వ డివిజన్ బంటు ప్రీతి, 35వ డివిజన్ ఎర్రం సుధీర్, 36వ డివిజన్ ధాత్రిక రేవతి, 37వ డివిజన్ అర్చన, 38వ డివిజన్ ఎం.మౌనిక, 39వ డివిజన్ జ్యోతి, 40వ డివిజన్ డి.సంజీవ్, 41వ డివిజన్ బురుగుల ఇందిర, 42వ డివిజన్ శశాంక్ రెడ్డి, 43వ డివిజన్ సోమలింగం, 44వ డివిజన్ బట్టు రాఘవేంద్ర, 45వ డివిజన్ బొబ్బిలి సువర్ణ, 46వ డివిజన్ శీల శ్రీనివాస్, 47వ డివిజన్ దుద్దిళ్ల గిరిబాబు, 48వ డివిజన్ ప్రసన్న సామల సత్యపాల్, 49వ డివిజన్ కూతురు వినోద, 50వ డివిజన్ కులకర్ణి జగదీష్.