అక్షరటుడే, లింగంపేట : Former MP BB Patil | గతంలో ఎన్నడూ లేనివిధంగా పల్లెల్లో బీజేపీ పాగా వేసిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బీబీ పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy Constituency) సర్పంచ్‌లుగా ఎన్నికైన బీజేపీ మద్దతుదారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) పల్లెల్లో బీజేపీ గట్టిపోటీ ఇచ్చి పలు స్థానాలను గెల్చుకుందన్నారు.
Former MP BB Patil | సార్వత్రిక ఎన్నికల్లోనూ..
అనంతరం కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విక్రంరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ (BJP Party) అధికారం చేపట్టేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో 21మంది సర్పంచులు, 18 ఉంది ఉప సర్పంచ్‌లు, 102 మంది వార్డు సభ్యులు గెలుపొందడం శుభపరిణామన్నారు. అనంతరం వారిని సన్మానించారు. లింగంపేట మండలం మోతే సర్పంచ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా (Kamareddy District) అధ్యక్షుడు నీలం చిన్నరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, పైడి ఎల్లారెడ్డి, రాంరెడ్డి, బాపురెడ్డి, లింగారావు, రామ్మోహన్ రెడ్డి, లింగంపేట పార్టీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్, మురళి, దత్తురాం, రామచందర్, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.