అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న తిరంగా ర్యాలీకి బీజేపీ పూర్తి మద్దతునిస్తుందని జిల్లా అధ్యక్షుడు (Nizmabad Bjp President Dinesh Kulachari) దినేష్ కులాచారి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) త్రివిధ దళాల సైనికులు విజయం సాధించిన నేపథ్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కులసంఘాలు, వర్తకులు, స్వచ్ఛంద సంస్థలు, మైనారిటీ, క్రైస్తవులు ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పహల్గామ్లో (Pahalgam Terror Attack) పర్యాటకులపై దాడిచేసినా.. భారతసైన్యం (Indian Army) మాత్రం కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందని గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, కిశోర్, మాజీ కార్పొరేటర్లు మల్లేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
