ePaper
More
    HomeజాతీయంBJP fires at Congress | కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు.. పాక్‌కు అనుకూలంగా ప‌ని చేస్తున్నార‌ని...

    BJP fires at Congress | కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు.. పాక్‌కు అనుకూలంగా ప‌ని చేస్తున్నార‌ని మండిపాటు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: BJP fires at Congress : ఆపరేషన్ (Operation Sindoor) త‌ర‌చూ ప్ర‌శ్న‌లు లేవ‌దీస్తున్న కాంగ్రెస్ పార్టీపై భార‌తీయ జ‌న‌తా పార్టీ(Bharatiya Janata Party) నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ(Congress leader Rahul Gandhi) పాకిస్తాన్(Pakistan) త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నార‌ని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసింది. ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో రెండు పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రాజకీయ అల‌జ‌డి రేగింది.

    BJP fires at Congress : మీర్ జాఫ‌ర్‌గా రాహుల్‌

    భార‌త సైన్యాన్ని(Indian Army) కించ‌ప‌రిచేలా రాహుల్‌గాంధీ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. ఆప‌రేష‌న్ సిందూర్ చిన్న యుద్ధ‌మ‌ని కాంగ్రెస్ చేస్తున్న వాద‌న‌ను తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీని ఆధునిక మీర్ జాఫ‌ర్‌గా బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాల్వియా(BJP IT cell in-charge Amit Malviya) అభివ‌ర్ణించారు. ఈ మేర‌కు మంగళవారం ’X’లో ఓ పోస్ట్ పెట్టిన ఆయ‌న‌ రాహుల్ గాంధీని “ఆధునిక యుగం మీర్ జాఫర్”(modern-day Mir Jafar)గా అభివర్ణించారు. వలస శక్తులకు భారత ప్రయోజనాలను ద్రోహం చేసిన చారిత్రక వ్యక్తి అని ఎద్దేవా చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌(External Affairs Minister Dr. S. Jaishanka)పై రాహుల్ చేసిన విమర్శలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత విమాన నష్టాలకు సంబంధించి అడిగిన ప్ర‌శ్న‌లు పాకిస్తాన్ మీడియా తప్పుదారి పట్టించే కథనాల‌కు బ‌లం చేకూర్చేలా ఉన్నాయ‌న్నారు. “గతంలో కూడా, పాకిస్తాన్ వ్యవస్థ రాహుల్ గాంధీ ప్రకటనలను సంతోషంగా ఉదహరించింది. అతని మాటలు పదేపదే సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి కవర్‌గా పనిచేస్తాయి” అని విమ‌ర్శించారు. “రాహుల్ గాంధీకి తదుపరి ఏమిటి? నిషాన్-ఎ-పాకిస్తాన్?” అని మాల్వియా ఎద్దేవా చేశారు.

    BJP fires at Congress : సైన్యాన్ని కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు..

    ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) ఆధారాల కోసం పదేపదే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Congress President Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ చేస్తుండడం మన సాయుధ బలగాలను అవమానించడమేనని బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర(BJP leader Sambit Patra) మండిప‌డ్డారు. ”మన సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోకి ప్రవేశించి అక్కడి 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం రాహుల్, ఖర్గేకు అర్ధం కాలేదా? పాకిస్థాన్ దాడులకు దిగడంలో అక్కడి 11 ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. ఇవాళ ఆ నొప్పితో పాక్ విలవిల్లాడుతోంది. ఇంత జరిగితే ఇవాళ ఆపరేషన్ సిందూర్‌ను చిన్న యుద్ధమంటూ వాళ్లు (ఖర్గే, రాహుల్) చెబుతున్నారు. ఇది దేశాన్ని, మన సాయుధ బలగాల సాహసాలను వంచించడమే అవుతుంది” అని సంబిత్ పాత్ర అన్నారు. రాహుల్ గాంధీ గత రెండ్రోజులుగా ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నించడంపై సంబిత్ పాత్ర ధ్వ‌జ‌మెత్తారు. మొదటి రోజు నుంచి తాము డిజిటల్ ఆధారాలను ప్రెజెంట్ చేస్తూనే ఉన్నామని చెప్పారు. అయినప్పటికీ సాయుధ బలగాల సాహసాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, ఆయన, ఆయన పార్టీ నేతలు పాకిస్థాన్ పోస్టర్ బాయ్స్‌గా మారడటమే దీనికి కారణమని కౌంటర్ ఇచ్చారు.

    BJP fires at Congress : రాహుల్‌ను త‌ప్పుబ‌ట్టిన బీఆర్ఎస్‌..

    మ‌రోవైపు, రాహుల్ వైఖ‌రిని భారత రాష్ట్ర సమితి(Bharatha Rashtra Samiti) కూడా త‌ప్పుబ‌ట్టింది. గోప్యమైన, సున్నితమైన జాతీయ భద్రతా సమస్యలను రాహుల్‌గాంధీ సోష‌ల్‌మీడియాలో ఎందుకు లేవనెత్తాలని BRS ప్రతినిధి డాక్టర్ క్రిశాంక్ ప్రశ్నించారు. “రాహుల్ జీ, ప్రశ్నలు అడగడం కొనసాగించండి, కానీ సరైన సమయంలో, సరైన స్థలంలో. అంతేకానీ సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నించ‌డం త‌గదు. అది భారతీయ స్వరాలను బలోపేతం చేస్తుంది. దాని ప్రత్యర్థులను కాదు” అని డాక్టర్ క్రిశాంక్ ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

    BJP fires at Congress : బీజేపీ పోస్టర్ యుద్ధం

    కాంగ్రెస్‌పై రాజకీయ యుద్ధం తీవ్రతరం చేసిన బీజేపీ సోషల్ మీడియా బృందాలు రాహుల్‌తో ఆటాడుకుంటున్నాయి. ఆయ‌న ముఖం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Pakistan Army Chief General Asim Munir) ముఖంతో కలిసిపోయిందని చూపించేలా తీర్చిదిద్దిన ఫొటోను వైర‌ల్ చేశాయి. ఆ ఫొటోకు రాహుల్‌గాంధీ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాడు, శత్రువు ప్రచారానికి సహాయం చేస్తున్నాడన్న‌ వ్యాఖ్యలు జోడించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...