అక్షరటుడే, వెబ్డెస్క్: Councillor Candidate Suicide | బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వార్డులో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
నారాయణపేట జిల్లా (Narayanpet District) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి ఆయన ఉరి వేసుకున్నాడు. దీంతో ఆ వార్డు పరిధిలో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. కాగా సోమవారం సాయంత్రం వరకు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న మహదేవప్ప రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుల వేధింపులతోనే ఆయన తనువు చాలించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Councillor Candidate Suicide | డీజీపీ కార్యాలయం ముట్టడి
మహదేవప్ప ఆత్మహత్యకు నిరసనగా బీజేపీ నాయకులు (BJP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారీగా నాయకులు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయం (DGP Office) వద్దకు తరలి వచ్చారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.