అక్షరటుడే, కామారెడ్డి: BJP Congress War Kamareddy | ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై (MLA Venkat Ramana Reddy) మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు (Congress, Kamareddy) లేదని బీజేపీ నాయకులు(BJP Kamareddy) అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
BJP Congress War Kamareddy | అర్హత లేని నాయకులు.. అవాకులు.. చవాకులు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై అర్హత లేని నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆర్యవైశ్యులకు చేసిందేమీ లేదన్నారు. వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఆర్యవైశ్యుల వ్యాపారాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. భిక్కనూరు మాజీ సర్పంచ్ చేసిన ఆరోపణలకు గ్రంథాలయ ఛైర్మన్ స్పందించాలని.. ఆ తర్వాత ఎమ్మెల్యే గురించి మాట్లాడాలన్నారు.
గుడుగుల శ్రీనివాస్.. చోటా షబ్బీర్ భాయ్..
కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ చోటా షబ్బీర్ భాయ్ అని, ఆయన కౌన్సిలర్ అయితే గన్‌మెన్‌ను పెట్టుకుని ఆయనకు సమస్యలు చెప్పుకుంటే సమస్యలు పరిష్కరిస్తామని ప్రచారం చేశాడని నాయకులు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గురించి మాట్లాడే ముందు ఆలోచించాలని సూచించారు. ఆధారాలుంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. తాము తమ నాయకుడిని తీసుకుని వస్తామని, షబ్బీర్ అలీని తీసుకుని చర్చకు రాగలారా అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్, అరవింద్ రాజ్, వినోద, రాహుల్ గౌడ్, భాను ప్రకాష్, నాయకులు భరత్, ప్రవీణ్, రాజు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.