అక్షరటుడే, ఇందూరు : BJP Condemns Attacks | అమాయక ప్రజలపై అసాంఘిక శక్తుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఈ మేరకు ఆయన బాధితులతో కలిసి సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya)కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
BJP Condemns Attacks | రాష్ట్రవ్యాప్తంగా దాడులు ఆందోళనకరం..
దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా హిందూ సమాజంపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కొద్దిరోజుల క్రితం బాన్సువాడ, మోపాల్ మండలం (Mopal Mandal) పరిధిలోని కాల్పోల్, రుద్రూర్, ఆనంద్ నగర్, ఇందూరు నగరంలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దాడులు జరిగినప్పటికీ సంబంధిత వ్యక్తులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనలు జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మారుతున్నాయని తక్షణమే పోలీసు శాఖ (Police Department) స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
BJP Condemns Attacks | రాజకీయంగా కాపాడే యత్నాలు..
దాడులకు పాల్పడుతున్న వారిని కొందరు రాజకీయంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని తమకు అనుమానం ఉందని దినేష్ ఆరోపించారు. పోలీసులు పక్షపాతరహితంగా వ్యవహరించి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన కోరారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా బీజేపీ (BJP) ఆధ్వర్యంలో రోడ్డెక్కి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
BJP Condemns Attacks | స్పెషల్ టీం ఏర్పాటు చేయాలి
జిల్లాలో అమాయకులపై జరిగిన దాడుల్లో నిజానిజాలు తెలిసేందుకు సీపీ తక్షణమే స్పెషల్ టీం ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని దినేష్ కులచారి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సున్నిత ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ పహార పెంచాలని ఆయన కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసి వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, గోపిడి వినోద్ రెడ్డి, కృష్ణ, మారెడ్డి వనిత సురేష్, ఆనంద్, విజయకృష్ణ, వినోద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
