Ramchander Rao Arrest | బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramchander Rao Arrest | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును పోలీసులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ వెళ్లడానికి ఆయన యత్నించగా.. అనుమతి లేదని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (MLA KVR), కాంగ్రెస్​ నాయకుల మధ్య సవాళ్లతో రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేకు మద్దతుగా శనివారం పలువురు బీజేపీ నాయకులు కామారెడ్డి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బాన్సువాడలో ఓ దుకాణంలో పాఠశాల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramchander Rao Arrest | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును పోలీసులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ వెళ్లడానికి ఆయన యత్నించగా.. అనుమతి లేదని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (MLA KVR), కాంగ్రెస్​ నాయకుల మధ్య సవాళ్లతో రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేకు మద్దతుగా శనివారం పలువురు బీజేపీ నాయకులు కామారెడ్డి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బాన్సువాడలో ఓ దుకాణంలో పాఠశాల విషయం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో కామారెడ్డితో పాటు బాన్సువాడ వెళ్లడానికి రాంచందర్​రావు ఆదివారం యత్నించారు.

Ramchander Rao Arrest | తీవ్ర ఉద్రిక్తత

చలో కామారెడ్డికి బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు ఉదయం నుంచే రాంచందర్​రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కామారెడ్డికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అన్నారు. అయినా ఆయన బయలుదేరడంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లారం పోలీస్​ స్టేషన్ (Bollaram Police Station)​కు తరలించారు.

కామారెడ్డిలో హైటెన్షన్​ కొనసాగుతోంది. పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు రాకుండా చర్యలు చేపట్టారు. ముఖ్య నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మహోరించారు. MLA కేవీఆర్ ఇంటి దగ్గర ఏఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Ramchander Rao Arrest | ఖండించిన బండి సంజయ్​

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్​రావు అరెస్ట్​ను కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)​ ఖండించారు. దాడి చేసిన వారిపై చర్య తీసుకునే బదులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిపక్ష నాయకుడిని నిర్బంధించాలని నిర్ణయించుకుందని విమర్శించారు. కాంగ్రెస్, MIM చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయని ఆరోపించారు. బాన్సువాడలో బాధితులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లాంటి రోజులు ప్రారంభమైనట్లు కనిపిస్తోందన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ...

Harish Rao Criticizes Revanth | సీఎం చేసిందేమి లేదు.. కూల్చిందే ఎక్కువ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రెండేళ్ల...