అక్షరటుడే, ఇందూరు: Bjp Nizamabad | బీహార్లో ఎన్డీయే కూటమి (NDA alliance) విజయం సాధించడంతో ఇందూరు నగరంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నగరంలో బీజేపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) ఆధ్వర్యంలో నిఖిల్సాయి చౌరస్తా వద్ద సంబురాలు చేసుకున్నారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) మాట్లాడుతూ బీహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధారణమైంది కాదన్నారు.
Bjp Nizamabad | బీజేపీని బీహార్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు..
బీజేపీని బీహార్ (Bihar) ప్రజలు అక్కున చేర్చుకున్నారని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. కాబట్టే అపూర్వ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రతివర్గానికి న్యాయం చేసే దిశగా బీహార్లో ఎన్డీయే పాలన సాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు న్యాలంరాజు, తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, మండల అధ్యక్షుడు ఆనంద్ రావు, తారక వేణు, బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పుట్ట వీరేందర్, ఇప్పకాయల కిషోర్, మఠం పవన్, భూపతి చిరంజీవి, దీపక్, నరేష్, శిలా శ్రీనివాస్, భూమేష్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
