అక్షరటుడే, ఎల్లారెడ్డి: Banala Lakshmareddy | మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను (councilor candidates) గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి (Banala Lakshmareddy) అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులుతో కలిసి ఎల్లారెడ్డి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Banala Lakshmareddy | గెలుపే లక్ష్యంగా పోరాడాలి..
బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై (Yellareddy municipality) కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. అభ్యర్థులు సైతం ప్రజల్లోకి వెళ్లి పీఎం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడగాలన్నారు.
సమష్టి కృషితో విజయం సాధ్యం..
ఎల్లారెడ్డిలో బీజేపీ నిలువాలంటే సమష్టి కృషితోనే సాధ్యమని బాణాల అన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు పొతంగల్ కిషన్ రావు, సీనియర్ నాయకులు పాటిమీద గంగారెడ్డి, మహారాజుల మురళి, ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ దేవేందర్, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల అధ్యక్షులు నర్సింలు, మధుసూదన్, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు రాజేష్, గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల మాజీ అధ్యక్షులు సాయిబాబా, ఎస్.ఎన్. రెడ్డి, హన్మాండ్లు, దత్తురాం, ఎల్లారెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, సీనియర్ నాయకులు హోటల్ శీను, కిష్టయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.