అక్షరటుడే, ఇందూరు : BJP candidate Matam Pawan | తనను ఆదరించి కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని 8వ డివిజన్ బీజేపీ అభ్యర్థి మఠం పవన్ అన్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
BJP candidate Matam Pawan | ఒక్కసారి అవకాశమివ్వండి..
ఈ సందర్భంగా మఠం పవన్ మాట్లాడుతూ.. బీజేపీతోనే (BJP Nizamabad) నగరాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) ఆధ్వర్యంలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అలాగే ప్రతి డివిజన్లో ఉన్న సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. వారి ఆధ్వర్యంలో డివిజన్‌ను అభివృద్ధి బాట పట్టిస్తానని హామీ ఇచ్చారు.
కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో..
కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పవన్ వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం ఉజ్వల్ యోజన ఇలా అనేక పథకాలు రైతులు, పేదలకు అందుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందని.. ఆ స్ఫూర్తితో తాను డివిజన్‌ను సైతం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల్లో ఒకడిగా ఉంటా..
ప్రజల్లో ఒకడిగా ఉంటూ వారి సమస్యలను నా సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని మఠం పవన్ హామీ ఇచ్చారు. కొట్లాడి డివిజన్‌కు నిధులు తీసుకొస్తానని డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువ మోర్చా, మహిళా మోర్చా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

1 comment
[…] advisor Shabbir Ali | అభివృద్ధి చేశానని చెప్పి… BJP candidate Matam Pawan | ప్రజలకు అందుబాటులో ఉండి… Duddolla Giribabu | ఆశీర్వదించండి.. ఎళ్లవేళలా […]
Comments are closed.