అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP states in-charges | వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందస్తు సన్నాహాల్లో భాగంగా కీలకమైన సంస్థాగత నియామకాలను ప్రకటించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను తమిళనాడు Tamil Nadu కు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఆయనకు అర్జున్ రామ్ మేఘవాల్, మురళీధర్ మోహోల్ సహకారంగా ఉంటారని పార్టీ ప్రకటించింది.
వీరిని రాష్ట్రానికి సహ-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. సీనియర్ బీజేపీ నాయకుడు లబైజయంత్ పాండాకు అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతను పార్టీ అప్పగించింది. ఆయనకు సునీల్ కుమార్ శర్మ, దర్శనా బెన్ జర్దోష్ మద్దతుగా ఉండనున్నారు. ,వీరిని భాజపా సహ-ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. అస్సాం, తమిళనాడులో వచ్చే ఏడాది అంటే 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
పీయూష్ గోయల్ ఇప్పటి వరకు రెండుసార్లు తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఒకసారి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. తాజాగా మరోసారి. ఇక బైజయంత్ పాండా కూడా అస్సాంకు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఇందులో పార్టీ అధికారాన్ని నిలబెట్టుకున్న 2021 ఎన్నికలు కూడా ఉండటం గమనార్హం. పాండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సైతం ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులు కావడం విశేషం. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ ఉత్తరప్రదేశ్‌కు ఆయన ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
BJP states in-charges | బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
2025 బీహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఘన విజయం సాధించి, మహాకూటమిని చిత్తు చేసింది. 243 మంది సభ్యులున్న బీహార్ శాసనసభలో 200కు పైగా స్థానాలను సొంతం చేసుకుంది. బీహార్‌లో బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మిత్రపక్షమైన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 85 స్థానాలను సొంతం చేసుకుంది. మరోవైపు, తేజస్వి యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. ఎన్డీఏ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజారంజక పాలనకు లభించిన గెలుపుగా వర్ణించారు.