- Advertisement -
HomeతెలంగాణPCC Chief | బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం: పీసీసీ చీఫ్​

PCC Chief | బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం: పీసీసీ చీఫ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :PCC Chief | బీజేపీ, బీఆర్ఎస్​ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్​ గౌడ్(Bomma Mahesh Kumar Goud)​ ఆరోపించారు.

బీఆర్​ఎస్(BRS)ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh)​ సైతం ఆమె వ్యాఖ్యలు నిజమేనన్నట్లు మాట్లాడారు. వారి వ్యాఖ్యలపై మహేశ్​గౌడ్​ స్పందించారు.

- Advertisement -

కొందరు బీజేపీ సీనియర్‌ నేతలకు కేసీఆర్‌(KCR)తో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజాసింగ్‌ చెప్పినట్లు బీజేపీ లోక్‌సభ టికెట్లు కూడా కేసీఆర్‌ సూచనలతోనే ఇచ్చారని ఆరోపించారు. రేపో మాపో బీజేపీ(BJP)లో బీఆర్ఎస్ విలీనమవుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ బలపడుతోందని, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News