అక్షరటుడే, ఇందూరు : BJP 39th Division Development | నగరంలోని 39వ డివిజన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని జ్యోతి మురళి కృష్ణ (Jyothi Murali Krishna) అన్నారు. ఈ మేరకు కాలనీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
BJP 39th Division Development | బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..
నిజామాబాద్ అర్బన్‌లో (Nizamabad Urban) అవినీతి లేకుండా అభివృద్ధి కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో పూర్తిస్థాయిలో డివిజన్‌ను ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యంగా దృష్టిపెడతామని హామీ ఇచ్చారు.
ఆదరించండి అవకాశం ఇవ్వండి..
తనను ఆదరించే అవకాశం ఇస్తే 19వ డివిజన్‌ను ముందుకు తీసుకెళ్తానని జ్యోతి అన్నారు. ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి అవినీతి జరగకుండా లబ్ధిదారులకు అందేలా చేస్తానన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.