అక్షరటుడే, వెబ్డెస్క్: Mla Laxmi Kantha Rao | పంచాయతీ ఎన్నికల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు (MLA Thota Laxmikantharao) చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడప్గల్ (Jukkal constituency) మండలంలోని బేగంపూర్ తండాలో ఎమ్మెల్యే తోట ప్రచారానికి శుక్రవారం వెళ్లారు.
Mla Laxmi Kantha Rao | అడ్డుకున్న యువకులు..
బేగంపూర్ గ్రామంలో (Begumpur village) ప్రచారం ముగించుకున్న అనంతరం బేగంపూర్ తండామీదుగా కాస్లాబాద్కు ప్రచారానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో తండామీదుగా వెళ్తుంగా తండావాసులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తమ తండాకు మంజూరైన సీసీ రోడ్డును కొందరు పలుకుబడి కలిగిన కాంగ్రెస్ నాయకులు బేగంపూర్ గ్రామంలో వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన సీసీ రోడ్ను అన్యాయంగా కాంగ్రెస్ నాయకులు క్యాన్సిల్ చేశారని వారు ఎమ్మెల్యేను నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే వారితో కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు.