ePaper
More
    HomeజాతీయంIndigo Flight | విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

    Indigo Flight | విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo Flight | ఓ పక్షి విమాన ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. గాలిలో ఉండగా.. విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు. ఈ ఘటన పట్నాలో చోటుచేసుకుంది. ఇటీవల తేనేటీగల గుంపు కారణంగా విమానం ఆలస్యంగా బయలు దేరిన విషయం తెలిసిందే. సూరత్ విమానాశ్రయం(Surat Airport) నుంచి జైపూర్ వెళ్తున్న ఇండిగో విమానం(Indigo Flight) లగేజీ డోర్​ దగ్గరకు తేనేటీగల గుంపు రావడంతో గంట ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. తాజాగా మరో ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొనడం గమనార్హం.

    పట్నా ఎయిర్​పోర్టు(Patna Airport) నుంచి ఇండిగో విమానం బుధవారం ఢిల్లీ బయలు దేరింది. అయితే టేకాఫ్​ అయిన కొద్ది క్షణాలకే ఫ్లైట్​ను పక్షి(Bird) ఢీకొంది. దీంతో అప్రమత్తమైన పైలెట్​ పట్నా ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండింగ్​(Emergency Landing) చేశారు. ఆ సమయంలో ఫ్లైట్​లో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షి ఢీకొనడంతో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానానికి మరమ్మతులు చేస్తున్న అధికారులు.. మరో విమానంలో ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల పట్నా నుంచి కోల్​కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని సైతం పక్షి ఢీకొన్న విషయం తెలిసిందే. గతంలోనూ పక్షులు ఢీకొనడంతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు.

    Indigo Flight | ప్రయాణికుల్లో ఆందోళన

    అహ్మదాబాద్​లో ఇటీవల ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదలో 270 మంది మరణించారు. ఈ ప్రమాదం అనంతరం విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్​ ప్రమాదం తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలతో పలు విమానాలు నిలిచిపోయాయి. దీంతో విమానం ఎక్కాలంటేనే ప్రజలు జంకుతున్నారు. తాజాగా విమాన ప్రయాణికులను పక్షులు సైతం కలవర పెడుతున్నాయి.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...