HomeUncategorizedIndigo | విమానాన్ని ఢీకొన్న పక్షి.. అత్యవసర ల్యాండింగ్

Indigo | విమానాన్ని ఢీకొన్న పక్షి.. అత్యవసర ల్యాండింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Indigo | ఆకాశంలో ఎగిరే పక్షులు అప్పుడప్పుడు పెద్ద పెద్ద విమానాలను(Airplanes) సైతం భయపెడతాయి. తాజాగా ఓ పక్షి(Bird) విమానాన్ని ఢీకొంది. దీంతో పైలెట్​ ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్​ చేశాడు. పాట్నా నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని(Indigo Flight) దాదాపు 4,000 అడుగుల ఎత్తులో రాబందు ఢీకొంది. దీంతో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పైలెట్(Pilot)​ ఫ్లైట్​ను వెంటనే రాంచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని రాంచీ ఎయిర్​పోర్టు అధికారులు(Ranchi Airport officers) తెలిపారు.

Must Read
Related News