అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indigo Flight | ఇండిగో (Indigo) విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్‌ను పక్షి ఢీకొంది.
హైదరాబాద్ (Hyderabad)లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో గురువారం ఉదయం విమానాన్ని పక్షి ఢీకొంది. జైపూర్ (Jaipur) నుంచి శంషాబాద్ వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలెట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Indigo Flight | గతంలో..
దేశంలో గతంలో కూడా పలు మార్లు విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. జూన్ 2న పట్నా నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకు పక్షి ఢీకొంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ నెల 4న విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై వెళ్తుండగా పక్షి ఢీకొంది. దీంతో వెంటనే విమానాన్ని నిలిపివేశారు.