అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bird Flu Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండటంతో కోళ్ల ఫాంల యజమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సదుం మండలం (Sadum Mandal)లోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో కొన్ని రోజులుగా కోళ్లు చనిపోతున్నాయి.
దీంతో కోళ్ల ఫాంల నిర్వాహకులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఆయా పౌల్ట్రీ ఫాంలను (Those Poultry Farms) పరిశీలించారు. దాదాపు 28 వేల కోళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. కోళ్ల నమూనాలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్ గల హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షలు చేసిన అనంతరం కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయినట్లు నిర్ధారణ అయింది.
Bird Flu Andhra Pradesh | కంట్రోల్ రూమ్ ఏర్పాటు
బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై అన్నమయ్య జిల్లా (Annamayya district) అధికారులు అప్రమత్తం అయ్యారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ (Collector Nishant Kumar) సంబంధిత అధికారులతో సమీక్షించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోళ్లు మృతి చెందిన పౌల్ట్రీ రైతులకు పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లో అధికారులు పర్యటిస్తూ.. అవగాహన కల్పిస్తున్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Bird Flu Andhra Pradesh | పది రోజులు తినొద్దు
బర్ ఫ్లూ వ్యాప్తి చెందిన గ్రామాల్లో మిగతా కోళ్ల ఫాంలను సైతం అధికారులు పరిశీలించార. ఆయా గ్రామాల్లో పది రోజుల పాటు ప్రజలు చికెన్, గుడ్లు తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. బాగా ఉడికించిన మాంసం తినాలని సూచించారు. కాగా బర్డ్ ఫ్లూ వ్యాప్తితో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగతా గ్రామాలకు సైతం వైరస్ వ్యాపిస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చికెన్ తినాలంటే ఆలోచిస్తున్నారు.