అక్షరటుడే, ఇందూరు: Inter Students | ఇంటర్ బోర్డు కమిషనర్ (Inter Board Commissioner) ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College) విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. బుధవారం డీఐఈవో కార్యాలయంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయడానికి విద్యార్థుల బయోడేటా ఆధార్ ఇంటర్ బోర్డు లాగిన్‌ను నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. అపార్ గుర్తింపు లేనివారికి వెంటనే నెంబర్ కేటాయించాలని సూచించారు.
విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల సమయపాలన పాటించాలని, ఇందుకు ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. కళాశాల ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్ట్‌లను పూర్తిచేయాలన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 4,386 మంది విద్యార్థులు చేరారని తెలిపారు.
Inter Students | కమిటీలను ఏర్పాటుచేయాలి..
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (Amma Adarsh School Committee) తొందరగా ఏర్పాటు చేయాలని డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar) ఆదేశించారు. అలాగే పేరెంట్స్ మీటింగ్ (Parents meeting) నిర్వహించాలన్నారు. ఇంటర్ బోర్డు కేటాయించిన నిధులతో తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్ మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు.