అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Temple Governing bodies | శ్రీ శంభు లింగేశ్వర ఆలయ ఛైర్మన్‌గా బింగి మధు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) ఆధ్వర్యంలో ఆయనతోపాటు కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, సహకార యూనియన్ (Cooperative Union) ఛైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు (Farmers Commission) గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాపూజీ వచనాలయ కమిటీ ఛైర్మన్ భక్తవత్సలం, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రాంభూపాల్ తదితరులు హాజరయ్యారు.