అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bill Gates Andhra Visit | ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు వచ్చారు. సీయోల్ సౌత్ కొరియన్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు.
గన్నవరంలో బిల్‌గేట్స్‌కు మంత్రులు నారా లోకేష్ (Minister Nara Lokesh), అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత (Vangalapudi Anitha), పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. బిల్‌గేట్స్ విమానం గన్నవరం చేరుకున్న తర్వాత ల్యాండింగ్ సమయంలో కొంత ఆందోళన నెలకొంది. ప్రతికూల వాతావరణంతో గన్నవరం (Gannavaram)లో విమానం ల్యాండ్ కాలేకపోయింది. దీంతో అరగంట పాటు పైలెట్లు విమానాన్ని గాలిలో చక్కర్లు కొట్టారు. పొగమంచు కారణనంగా విమానం ల్యాండ్ చేయలేకపోయారు. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. బిల్‌గేట్స్‌కు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో అమరావతికి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు.
Bill Gates Andhra Visit | ఆర్టీజీఎస్ కేంద్రం సందర్శన
అనంతరం సీఎం చంద్రబాబు (CM Chandrababu) నివాసం సమీపంలో ఉన్న సంజీవని ప్రాజెక్టుకు చేరుకుని అరటి రైతులతో బిల్ గేట్స్ సమావేశం అవుతారు.మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.బిల్‌గేట్స్‌తో పాటు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం సైతం గన్నవరం చేరుకుంది. ఈ ఫౌండేషన్ సాయంతో ఏపీలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు విస్తరించే అంశంపై వీరు చర్చించనున్నారు. అనంతరం ఆర్టీజీఎస్ కేంద్రానికి బిల్‌గేట్స్ వెళ్తారు. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలిస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు నాయుడు వారికి వివరించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) సహకారంలో ఏపీలో సంజీవని ప్రాజెక్ట్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బిల్‌గేట్స్‌కు చంద్రబాబు వివరిస్తారు.