అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలపై బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన తాడ్వాయి మండలంలో (Tadwai mandal) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందాపూర్ గ్రామానికి చెందిన పైడి చిన్న గంగారెడ్డి(60) బైక్‌పై తాడ్వాయికి బయలుదేరాడు.
గ్రామ శివారులో రహదారిపై మొక్కజొన్న కుప్పలు ఉండటంతో వాటిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన గంగారెడ్డిని జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన బతకలేదు.
Kamareddy | రోడ్లపై ధాన్యం, మక్కలు ఆరబోయవద్దని చెప్పినా..
రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) రైతులకు గతంలోనే విజ్ఞప్తి చేశారు. అయినా రైతులు (Farmers) మాత్రం ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలాల్లేక రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలతో ప్రమాదాలు సంభవించి ప్రాణాలు పోయే ప్రమాదముందని ఎస్పీ సూచించారు.