అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mendora | జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైవేలపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవలే కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు బ్లాక్ స్పాట్స్‌ను సైతం గుర్తించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారణం ఏదైనా వరుసగా యాక్సిడెంట్లు జరుగుతుండడంతో పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు.
Mendora | చెట్టును ఢీకొని..
బైక్ చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెండోరా (Mendora) మండలంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోచంపాడ్ గ్రామానికి చెందిన అఖిల్(26) తెల్లవారుజామున స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో సోషల్ వెల్ఫేర్ వసతి గృహం సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.