More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | బైక్, డీసీఎం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

    Banswada | బైక్, డీసీఎం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బైక్​ను డీసీఎం ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన నస్రుల్లాబాద్​లోని (Nasrullabad) నిజాంసాగర్​ కాలువ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన సాకలి సాయిలు, కుమ్మరి విఠల్ కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం ఎరువులు తెచ్చుకునేందుకు బోధన్ (Bodhan) వైపు బైక్‌పై బయలుదేరారు.

    ఈ క్రమంలో నస్రుల్లాబాద్​ మండలం నిజాంసాగర్ కాలువ (Nizamsagar canal) వద్ద బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స​ అందించారు. కుమ్మరి విఠల్ స్వల్పగాయాలతో బయటపడగా.. సాకలి సాయిలు కుడిచేయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో క్షతగాత్రుడిని అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రసాద్, పైలట్ శ్రీకాంత్ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    Bheemgal Mandal |ఘనంగా విశ్వకర్మ యజ్ఞం

    అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | భీమ్‌గల్‌ శివారులోని మోతె రోడ్ లో గల విశ్వకర్మగుట్టపై (Vishwakarma gutta)...

    Birkoor mandal | మానవత్వం చాటిన మాజీ జెడ్పీటీసీ సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkoor mandal | బీర్కూరు మండలం బైరాపూర్ లో పలు బాధిత కుటుంబాలకు మాజీ జెడ్పీటీసీ...

    Neeraj Chopra | విజయానికి మరో అడుగు దూరంలో.. ఫైనల్స్ కు చేరిన నీరజ్ చోప్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Neeraj Chopra | భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Indian star athlete Neeraj...