Saloora
Saloora | బైక్​,ఆటో ఢీ: పలువురికి గాయాలు

అక్షరటుడే,బోధన్: Saloora | బైక్​, ఆటో ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సాలూర మండల శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలోలి నుంచి బాన్సువాడకు ఆటోలో మేకలను తరలిస్తున్నారు. అయితే హున్సా–సాలూర రహదారిపై డ్రాగన్​ ఫ్రూట్​ తోట వద్ద ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటో బోల్తాపడింది. బైక్​పై వెళ్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.