HomeజాతీయంBihar Assembly Elections | ఓటెత్తిన బీహార్‌.. రెండో విడుత‌లో భారీగా పోలింగ్‌

Bihar Assembly Elections | ఓటెత్తిన బీహార్‌.. రెండో విడుత‌లో భారీగా పోలింగ్‌

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు ప్రశాంతంగా సాగుతున్నాయి. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కే 47.62 శాతం ఓటింగ్ న‌మోదైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు (Bihar Assembly Elections) పూర్త‌య్యాయి. మంగ‌ళవారం జ‌రిగిన రెండో విడుత ఎన్నిక‌లు చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన్ా ప్ర‌శాంతంగా జ‌రిగాయి. తొలి విడుత‌లో మాదిరిగా రెండో విడుత‌లోనూ భారీగా పోలింగ్ న‌మోదైంది. ఉద‌యం 7 గంట‌ల నుంచే ఓట‌ర్లు పోటెత్తారు.

దీంతో పోలింగ్ కేంద్రాలు (Polling Centers) కిట‌కిట‌లాడాయి. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కే 47.62 శాతం ఓటింగ్ న‌మోదైంది. 122 అసెంబ్లీ స్థానాల‌కు ఈ నెల 6న జ‌రిగిన తొలి విడుత ఎన్నిక‌ల్లో 65 శాతం ఓటింగ్ న‌మోదైంది. తాజాగా మంగ‌ళ‌వారం మ‌రో 122 నియోజ‌వ‌క‌ర్గాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించి ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు.

20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాలలో మంగ‌ళ‌వారం రెండో విడుత పోలింగ్ జ‌రిగింది. మొత్తం 1302 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌గా, 3.7 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరి కోసం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు ఉద‌యం నుంచే జ‌నం బారులు తీరారు.

Must Read
Related News