అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar Polling | బిహార్లో అసెంబ్లీ Assembly ఎన్నికలు కొనసాగుతున్నాయి. తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) ఉదయం 8 గంటలకు మొదలైంది.
కాగా, ఉదయం 7 గంటల ముందు నుంచే భారీగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. బిహార్ రాష్ట్రంలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 1,314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బిహార్లో 3.75 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరే తమ ప్రతినిధిని ఎన్నుకుని అసెంబ్లీకి పంపించబోతున్నారు.
Bihar Polling | ప్రధాన అభ్యర్థులు..
తొలిదశ పోలింగ్ జరిగే స్థానాల్లో మహాఘట్ బంధన్ Mahaghat Bandhan కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ Tejashwi Yadav, ఆర్జేడీ అగ్రవేశ RJD Agravesha, బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి బరిలో ఉన్నారు.
తేజస్వీ యాదవ్.. వైశాలి జిల్లా రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచే మరోమారు పోటీ పడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సతీశ్ కుమార్ పోటీ చేస్తున్నారు. 2010లో ఇక్కడ తేజస్వీ తల్లి రబ్రీదేవిని ఓడించింది ఈ సతీశ్ కావడం గమనార్హం.
జన్ సురాజ్ అధ్యక్షుడు Jan Suraj president, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ election strategist Prashant Kishor మొదట రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ, వెనక్కి తగ్గారు. తన పార్టీ తరఫున చంచల్ సింగ్‌ను బరిలో నిలిపారు. కాగా.. సతీశ్, తేజస్వీ మధ్యనే ప్రధాన పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
