అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar elections : బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసుతున్నాయి. ప్రధాన పార్టీల హామీలు, పార్టీల అంతర్గత వ్యవహారాలు ప్రధాన ఆకర్షణగా main attraction నిలుస్తున్నాయి. రోజుకో ఘటన చర్చకు దారితీస్తోంది. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar assembly elections) కు మరో 10 రోజుల సమయం ఉండగా.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార జేడీయూ పార్టీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరు మాజీ ఎమ్మెల్సీ MLC లు, నలుగురు మాజీ ఎమ్మెల్యే MLA లు సహా 11 మంది ముఖ్య నేతలపై జేడీయూ పార్టీ వేటు వేసింది. వీరు నేతలు జేడీయూ JDU ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ తెలిపింది. వీరు పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని జేడీయూ వెల్లడించింది.
Bihar elections | తారాస్థాయికి పోరు…
బీహార్ ఎన్నికల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో.. ఎన్డీఏ, ఇండియా కూటమిలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
అధికార, ప్రతిపక్ష కూటమిలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నాయి. కౌంటర్, ప్రతి కౌంటర్లతో రక్తి కట్టిస్తున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కీలక నేతలపై జేడీయూ పార్టీ వేటు వేయడంతో.. ఈ ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Bihar elections | ఎన్నికల చిత్రం..
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో అంటే.. నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబరు 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.

