అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీయే 160 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్(122)ను దాటేసింది. ఇక మరోవైపు మహాగఠ్ బంధన్ కూటమి (Mahagath Bandhan alliance) ప్రస్తుతం 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే ప్రశాంత్ కిశోర్ పార్టీ జేఎస్పీ ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్డీయేలోని కీలక భాగస్వామయ్య పార్టీలైన బీజేపీ, జేడీయూ చెరో 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక విపక్ష కూటమిలోని మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 56 సీట్లలో ముందంజలో ఉంది. కాగా.. బీహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
