అక్షరటుడే, హైదరాబాద్: Bihar election trains | బీహార్‌కు నూతన రైళ్లు, పొడిగింపుల పండుగ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బీహార్‌కు కావల్సినన్ని రైళ్లు ప్రకటిస్తోంది.
కొన్నింటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పొడిగిస్తోంది. ఇప్పటి వరకు కేవలం బీహార్‌కే ఏడు అమృత్ భారత్ రైళ్ళను ప్రవేశ పెట్టడం గమనార్హం. దేశంలో అత్యధికంగా అమృత్ భారత్ రైళ్లను బీహార్‌కే కేటాయించింది.
Bihar election trains | తెలంగాణ మీది నుంచి వెళ్లే రైళ్లు ఇవే..
బీహార్‌లో 16602/01 జోగ్భనీ అమృత్ భారత్ రైలు Amrit Bharat trains ను రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ రైలు జోగ్భని ఈరోడ్ నుంచి మంచిర్యాల, వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది.
ఇక మరో రైలు విషయానికి వస్తే.. బీహార్‌లోని పాటలీ పుత్ర నుంచి ఎస్.ఎం.వి.టి బెంగళూరు వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 22352/51 రైలును.. పాటలీ పుత్ర నుంచి బీహార్ లోని సహర్స జంక్షన్ వరకు పొడిగించారు. ఈ రైలుకు తెలంగాణలోని సిర్పూర్ కాగజ్‌నగర్ Sirpur Kagaznagar, రామగుండం Ramagundam, వరంగల్ Warangal , ఖమ్మం Khammam రైల్వే స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.
గత 6 సంవత్సరాలుగా ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుగా నడుస్తున్న 07052/51 బీహార్‌లోని రక్సల్ – సికింద్రాబాద్ – రక్సల్ రైలును తిరుపతి రైల్వే స్టేషన్ Tirupati railway station వరకు పొడిగించారు.
మరో వారం, 10 రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముందట ప్రతిపాదిత ముజఫర్ పూర్ నుంచి సికింద్రాబాద్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.