అక్షరటుడే, వెబ్డెస్క్ : Election Commission | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేపట్టింది. అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఆ లోపు అధికారుల బదిలీలు పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ (Election Commission) బీహార్ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 6 నాటికి ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్ ప్రక్రియలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఎన్నికల అధికారిక ప్రకటనకు ముందు నిష్పాక్షిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారుల బదిలీలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
Election Commission | బీహార్లో సీఈసీ పర్యటన
బదిలీ – పోస్టింగ్ కసరత్తు పూర్తయిన తర్వాత ఎన్నికలకు రాష్ట్ర సన్నద్ధతను సమీక్షించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) బీహార్లో పర్యటించనున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. అక్టోబర్ 6 తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) షెడ్యూల్ను ప్రకటిస్తారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) తక్షణమే అమల్లోకి వస్తుంది. బదిలీలు, పోస్టింగ్లు. కొత్త ప్రభుత్వ పథకాలు లేదా ప్రకటనలపై నిషేధం అమలులోకి వస్తుంది.
Election Commission | కాంగ్రెస్ మేనిఫెస్టో..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gnadhi) మేనిఫెస్టోను గురువారం ఆవిష్కరించారు. వెనుకబడిన వర్గాలను బలోపేతం చేస్తామని, విద్య, పాలన, అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. బీజేపీ అబద్ధాలు వ్యాప్తి చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు. వెనుకబడిన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు పూర్తి హక్కులను కల్పించడంలో కాంగ్రెస్ నిబద్ధతను రాహుల్ పునరుద్ఘాటించారు. ఈ వర్గాలకు న్యాయం, సమానత్వం, గౌరవాన్ని కాపాడడానికి మేనిఫెస్టో రూపొందించినట్లు రాహుల్ సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘X’లో పోస్టు చేశారు.