HomeజాతీయంBihar Elections | బీహార్ డిప్యూటీ సీఎం కారుపై చెప్పులతో దాడి

Bihar Elections | బీహార్ డిప్యూటీ సీఎం కారుపై చెప్పులతో దాడి

తొలి దశ పోలింగ్​ రోజు బీహార్​లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాపై ఆర్జేడీ కార్యకర్తలు దాడి చేశారు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్ డిప్యూటీ సీఎం (Bihar Deputy CM) విజయ్ కుమార్ సిన్హాపై దాడి జరిగింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా గురువారం తొలి విడత పోలింగ్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిన్హాపై ఆర్జేడీ మద్దతుదారులు దాడికి యత్నించారు.

లఖిసరాయ్‌ నియోజకవర్గంలో (Lakhisarai Constituency) తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేశారని విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు. కారును చుట్టుముట్టిన ఆర్జేడీ మద్దతుదారులు చెప్పులు విసిరారు. ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆయన కారు కదలకుండా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసన కారులను చెదరగొట్టారు.

Bihar Elections | ఆటవిక రాజ్యం

తన కారుపై ఆర్జేడీ కార్యకర్తలు (RJD Leaders) చెప్పులు, ఆవు పేడ విసిరారని డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా చెప్పారు. రాళ్లతో సైతం దాడి చేశారన్నారు. ఆర్జేడీ కార్యకర్తలు ఓ పోలింగ్​ బూత్​ను స్వాధీనం చేసుకునే యత్నం చేశారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న తనపై ఆర్జేడీ శ్రేణులు దాడి చేశాయన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆటవిక రాజ్యం తప్పదనడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేస్తామన్నారు.

Bihar Elections | 53 శాతం ఓటింగ్​

బీహార్​లో తొలిదశలో 121 నియోజకవర్గాల్లో పోలింగ్​ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 53.77 శాతం పోలింగ్​ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​ సాయంత్రం 6 గంటలకు కొన్ని చోట్ల సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.