HomeUncategorizedBihar CM Nitish Kumar | ఎన్నిక‌ల వేళ బీహార్ సీఎం న‌జ‌రానా.. సామాజిక పెంఛ‌న్ల...

Bihar CM Nitish Kumar | ఎన్నిక‌ల వేళ బీహార్ సీఎం న‌జ‌రానా.. సామాజిక పెంఛ‌న్ల మొత్తం పెంపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar CM Nitish Kumar | బీహార్ ఎన్నిక‌లు(Bihar elections) స‌మీపిస్తున్న త‌రుణంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీష్‌కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సామాజిక భద్రతా పెన్షన్ పథకం(Social Security Pension Scheme) కింద నెలవారీగా ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. “వృద్ధులు, వికలాంగులు, వితంతులు, మహిళలు అందరూ ఇప్పుడు ప్రతి నెలా రూ.400 పింఛ‌న్‌కు రూ.1,100 చొప్పున పొందుతారు” అని నితీష్ కుమార్ ‘X’లో పోస్ట్ చేశారు. వ‌చ్చేనెల జూలై నుంచి ఈ పెంపు అమ‌లు చేస్తామ‌ని చెప్పారు.

అలాగే ప్ర‌తినెలా 10వ తేదీ లోపు పింఛ‌న్లు చెల్లించేలా చూస్తామ‌ని తెలిపారు. తాజా నిర్ణ‌యంతో రాష్ట్రవ్యాప్తంగా 1.09 కోట్ల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుంద‌ని నితీష్ వెల్ల‌డించారు. వృద్ధులను “సమాజంలో విలువైన భాగమ‌ని అభివర్ణించిన బీహార్ సీఎం(Bihar CM Nitish Kumar).. వారి గౌర‌వ‌ప్రద‌మైన జీవ‌నాన్ని నిర్ధారించ‌డం త‌మ ప్ర‌ధాన విధి అని తెలిపారు. ఈ దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం(State Government) ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తుంద‌న్నారు. పింఛ‌న్ డ‌బ్బుల‌ను 10వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

ఈ ఏడాది చివరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పింఛ‌న్ల పెంపు ప్రకటన వెలువడింది. అధికార జనతాదళ్(యునైటెడ్), నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లోని దాని మిత్రదేశాలు.. రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రంలో బ‌లోపేతం కావ‌డమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గురువారం సివాన్‌ను సందర్శించారు. ఈ సంవ‌త్స‌రంలోనే మోదీ బీహార్‌లో ప‌ర్య‌టించ‌డం ఇది ఐదోసారి.

Must Read
Related News