HomeజాతీయంBihar Assembly elections | ఓట్లు కురిపించిన వరాలు.. బీహార్​లో అవే గేమ్ ఛేంజర్

Bihar Assembly elections | ఓట్లు కురిపించిన వరాలు.. బీహార్​లో అవే గేమ్ ఛేంజర్

Bihar Assembly elections | రసవత్తరంగా సాగిన బీహార్ సమరం ముగిసి పోయింది. రెండు నెలల పాటు కొనసాగిన ఉత్కంఠతకు తెర పడింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar Assembly elections | రసవత్తరంగా సాగిన బీహార్ Bihar సమరం ముగిసి పోయింది. రెండు నెలల పాటు కొనసాగిన ఉత్కంఠతకు తెర పడింది.

సుదీర్ఘంగా సాగిన పోరులో అంతిమ విజేత ఎవరో తేలిపోయింది. అయితే, అటు ఎన్డీయే NDA.. ఇటు మహా ఘట్ బంధన్ హోరాహోరీగా పోరాడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీలే గేమ్ ఛేంజర్​గా మారాయి.

అవే విజేతను నిర్ణయించాయి. ప్రచారంలో భాగంగా కురిపించిన వరాలు ఓటర్లను తీవ్ర ప్రభావితం చేశాయి. సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి హామీలు ఒకవైపు మొగ్గేలా చేశాయి.

Bihar Assembly elections | రికార్డు స్థాయిలో పోలింగ్..

బీహార్​లోని 243 నియోజవర్గాలకు రెండు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.

యువత, మహిళలు ఉదయం నుంచే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొదటి దశలో 65.08 % మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆ తర్వాత రెండో దశలో దాదాపు 68.79 % మంది ఓటేశారు. మొత్తం 67.13% మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారని భారత ఎన్నికల సంఘం ప్రకారం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ నమోదు కావడంతో గెలుపు ఎవరిదో తేలిపోయింది.

Bihar Assembly elections | హామీలే గెలిపించాయ్..

బిహార్ Bihar ఎన్నికలు ఈసారి హోరాహోరీగా సాగాయి. బీజేపీ BJP, జేడీయూ JDU, ఎల్ జేపీ(ఆర్) LJP(R), ఆర్ఎల్ఎం RLM, హెచ్ఏఎం (HAM)తో కూడిన ఎన్డీయే కూటమి ఒకవైపు, ఆర్జేడీ RJD, కాంగ్రెస్ Congress, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ Vikas Sheel Insaan Party, వామపక్షాలతో Left parties కూడిన మహా ఘట్ బంధన్ మరోవైపు.. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సూరజ్ పార్టీ (జేఎస్పీ) ఇంకోవైపు.. ఎన్నికల్లో తీవ్రంగా పోరాడాయి.

ప్రచారంలో భాగంగా ఓటర్లపై వరాల జల్లు కురిపించాయి. అవే తాజా ఎన్నికల్లో కీలకంగా మారాయి. అన్ని పార్టీల మ్యానిఫెస్టోలలో ఉపాధి, ఉద్యోగాలు కేంద్రబిందువుగా ఉన్నాయి.

Bihar Assembly elections | ఉపాధి, ఉద్యోగాలపై హామీ..

ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగావకాశాలు, నైపుణ్య గణన, మెగా నైపుణ్య కేంద్రాల ద్వారా కోటి కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

అయితే, మహా ఘట్ బంధన్ Mahaghat Bandhan అధికారం చేపట్టిన 20 రోజుల్లోపు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. జన్ సూరజ్ కూడా అదే హామీ ఇచ్చింది.

వలస కార్మికులపైనా మూడు పార్టీలు హామీల వర్షం కురిపించాయి. ఇక మహిళలే కేంద్రంగా అనేక వరాలు ప్రకటించాయి. ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్​గార్​ యోజన Chief Minister’s Mahila Rozgar Yojana కింద 25 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10,000 బదిలీ చేసింది.

ఇది ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనికి తోడు పెన్షన్ల పెంపు, ఉచిత విద్యుత్ వంటివి కూడా తాజా ఎన్నికల్లో కీలకంగా మారాయి. గెలుపును ఏకపక్షం చేశాయి.

Must Read
Related News