అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar Assembly Election Results | పోటాపోటీ వరాల జల్లుతో దేశం మొత్తాన్ని ఆకర్షించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల జడ్జిమెంట్ డే రానే వచ్చింది.
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటలకు మొదలైంది. బ్యాలెట్ ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది. ఈ ఓట్లలో ఎన్డీఏ మూడు స్థానాల్లో లీడ్‌లో ఉంది.
రెండు స్థానాల్లో ఆర్జేడీ లీడ్‌లో కొనసాగుతోంది. రాఘోపూర్‌లో తేజస్వి ముందంజలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అధికారులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గట్టి భద్రత, నిఘా నీడలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Bihar Assembly Election Results | రెండు విడతల్లో..
బిహార్ ఎన్నికలు లో రెండు విడతల్లో (నవంబర్ 6, నవంబర్ 11న) ఎన్నికలు జరిగాయి. రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓటర్లు తరలొచ్చారు. 62.80 శాతం పురుషులు, 71.60 శాతం మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
