HomeUncategorizedRahul Gandhi | దేశ నేర రాజ‌ధానిగా బీహార్.. బీజేపీ, నితీశ్‌ల‌పై రాహుల్‌గాంధీ ఫైర్‌

Rahul Gandhi | దేశ నేర రాజ‌ధానిగా బీహార్.. బీజేపీ, నితీశ్‌ల‌పై రాహుల్‌గాంధీ ఫైర్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi | బీజేపీతో పాటు ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ (Chief Minister Nitish Kumar) క‌లిసి బీహార్‌ను భార‌త‌దేశ నేర రాజ‌ధానిగా మార్చాయ‌ని లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ (Congress leader Rahul Gandhi) ఆరోపించారు. ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను పాట్నాలోని తన నివాసం వెలుపల కాల్చి చంపిన ఘ‌ట‌న మ‌రోసారి ఇది నిరూపించింద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, నితీశ్ పాల‌న‌లో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువ‌య్యాయ‌ని విమర్శించారు. ప్ర‌భుత్వాన్ని మార్చ‌డానికే కాకుండా రాష్ట్రాన్ని కాపాడ‌డానికి రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌ని కోరారు. ఈ మేర‌కు రాహుల్ ఆదివారం ‘X’లో హిందీలో ఓ పోస్ట్ (Rahul gandhi post on twitter) చేశారు. “పాట్నాలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గుర‌య్యారు. బీజేపీ, నితీశ్ క‌లిసి బీహార్‌ను దేశ నేర రాజ‌ధానిగా మార్చార‌ని చెప్పేందుకు ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నమ‌ని” అన్నారు.

Rahul Gandhi | పెచ్చ‌రిల్లిన అరాచ‌కాలు

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువ‌య్యాయ‌ని, అరాచ‌కాలు రాజ్య‌మేలుతున్నాయ‌ని రాహుల్ ఆరోపించారు. బీహార్ ప్ర‌స్తుతం దోపిడీ, తుపాకీ కాల్పులు, హత్యలతో స‌త‌మ‌త‌మ‌వుతోంద‌న్నారు. నేరాలు ఇక్కడ నిత్య‌కృత్య‌మ‌య్యాయ‌ని ఆరోపించారు. అరాచ‌కాల‌ను అరిక‌ట్ట‌డంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమ‌ర్శించారు. “బీహార్ సోదరసోదరీమణులారా, ఈ అన్యాయాన్ని ఇకపై సహించలేము. మీ పిల్లలను రక్షించలేని ప్రభుత్వం మీ భవిష్యత్తుకు కూడా బాధ్యత వహించదు” అని ఆయన వ్యాఖ్యానించారు.

Rahul Gandhi | స‌మ‌యం వ‌చ్చింది..

హ‌త్యా రాజ‌కీయాల నుంచి, దోపిడీ దొంగ‌ల నుంచి బీహార్ మార్పును కోరుకుంటోంద‌ని రాహుల్ (Congress leader Rahul Gandhi) తెలిపారు. “ఇప్పుడు కొత్త బీహార్ నిర్మాణానికి సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లుగా ఇక్కడ పురోగతి లేదు, భయం లేదు. ఈసారి ఓటు ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు, బీహార్‌ను రక్షించడానికి” అని ఆయన పేర్కొన్నారు.

Must Read
Related News