HomeUncategorizedSBI Jobs | ఎస్‌బీఐలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌.. 18వేల పోస్టుల భ‌ర్తీకి స‌న్నాహాలు

SBI Jobs | ఎస్‌బీఐలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌.. 18వేల పోస్టుల భ‌ర్తీకి స‌న్నాహాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: SBI Jobs | బ్యాంకింగ్ రంగంలో స్థిర‌ప‌డాల‌నుకునే అభ్య‌ర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభ‌వార్త చెప్పింది. దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ.. భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌(recruitment drive)ను ప్రారంభించ‌నుంది. 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 18 వేల మందిని నియమించుకోనుంది. ఇందులో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) వంటి కీలక పోస్టులు కూడా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌లో కోర్ బ్యాంకింగ్‌(Core Banking)లో విధుల్లో పనిచేయడానికి ఇష్టపడే అభ్యర్థులకు ఎస్‌బీఐ(SBI) సువర్ణావకాశాన్ని క‌ల్పిస్తోంది.

SBI Jobs | బ‌లోపేతం చేసే దిశ‌గా..

ప్ర‌భుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ(SBI) సాంకేతిక మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే త‌న డిజిట‌ల్‌, ఐటీ సామర్త్యాల‌ను పెంపొందించ‌డానికి దాదాపు 1,600 సిస్టమ్స్ అధికారులను నియమించుకుంటోంది. ఇది దేశంలో బ్యాంకింగ్ డిజిటల్ పరిణామానికి దోహదపడే లక్ష్యంతో సాంకేతిక-అవగాహన ఉన్న అభ్యర్థులకు ఉత్తేజకరమైన అవకాశాలను సృష్టిస్తుంది.

SBI Jobs | ప‌దేళ్ల‌లో అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌..

ఎస్‌బీఐ(SBI) గ‌త పదేళ్ల‌లో చేప‌ట్ట‌నున్న అతి పెద్ద రిక్రూట్‌మెంట్ ఇదే. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తంగా 18 వేల మందిని నియ‌మించుకోనుంది. ఇందులో 14 వేల పోస్టులు క్లరిక‌ల్ సిబ్బంది(Clerical staff) కాగా, 3 వేల మంది ప్రొబేష‌న‌రీ, లోక‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్లు(Local bank officers), 1600 సిస్ట‌మ్ ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి. ఇది బ్యాంక్ ప్రతిష్టాత్మక వృద్ధి ప్రణాళికలు, శ్రామిక శక్తి విస్తరణను ప్రతిబింబిస్తోంది. బ్యాంకింగ్ రంగ చ‌రిత్ర‌లో అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌గా చెబుతున్నారు.