అక్షరటుడే, వెబ్‌డెస్క్: 2026 Pongal Movies | ప్రస్తుతం సినిమాలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం చాలా పెద్ద సవాలుగా మారింది. పెద్ద సినిమాలైతే.. సీజనల్ రిలీజ్‌లపై ఫోకస్ పెడుతుంటాయి. తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతికి సినిమా వస్తే సేఫ్ జోన్‌లో ఉండడంతో పాటు మంచి వసూళ్లు కూడా వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. పండుగ సెలవుల వలన, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ల దగ్గర చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో, 2026 సంక్రాంతికి (Pongal) పోటీ ఇప్పటికే మొదలైంది. ఒక్కో సినిమా రేసులోకి వస్తుండడంతో ఈసారి పోటీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని తెలుస్తుంది.
2026 Pongal Movies | పోటా పోటీగా..
మెగా157 – మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగే తొలి చిత్రం. అనార్కలి – మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం కూడా సంక్రాంతిపై కన్నేసింది. అలానే అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) – నవీన్ పోలిశెట్టి కామెడీ ఫిక్షన్ డ్రామా చిత్రం కూడా సంక్రాంతికి వస్తుంది. ఇప్పటి వరకు ఇవే సంక్రాంతి సినిమాలుగా కన్ఫర్మ్ అయ్యాయి అనుకుంటే రేసులోకి కొత్తగా ది రాజా సాబ్ (The Raja Saab) కూడా వచ్చినట్టే కనిపిస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పండుగ బరిలోకి దిగితే బెటర్ అన్న ఆలోచనతో మేకర్స్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట..
పవన్‌కు పండుగ సీజన్ అంటే సెంటిమెంట్. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) మేకర్స్ సంక్రాంతి టైమింగ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అఖండ 2 (Akhanda 2) చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ కావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నప్పటికీ, ఏదైనా ఆలస్యం జరిగితే, సంక్రాంతికే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. జన నాయకన్ (దళపతి విజయ్) చిత్రం విజయ్ చివరి సినిమా కాగా, అది కూడా సంక్రాంతికి రిలీజ్ కానుందని బలమైన సమాచారం. శివకార్తికేయన్ సినిమా కూడా సంక్రాంతి లైన్‌లో ఉందని టాక్. సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల టైం ఉండడంతో, మరిన్ని సినిమాలు ఈ రేసులోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే, కొన్ని సినిమాలు పోటీని దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
